తెలంగాణ

కాళేశ్వరం అవినీతిలో కొత్త ట్విస్ట్.. నిధుల మళ్లింపు వారి ఖాతాల్లోకే!?..

కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో మరో కీలక కోణం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు అధికారుల వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు సాగుతుండగా.. ఇప్పుడు ఉద్యోగుల అసోసియేషన్ల ఖాతాలపైనా ఫోకస్ పెట్టాలన్న చర్చ మొదలైంది. కాళేశ్వరం పనులు సాగిన సమయంలో ఆయా ఖాతాల్లో భారీగా నిధులు జమయ్యాయా? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి బదిలీ అయింది? అనే అంశాలు దర్యాప్తులో కీలకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై సమగ్ర విచారణ అవసరమంటుండగా.. బీఆర్ఎస్ ఆరోపణలను రాజకీయ కక్షగా కొట్టిపారేస్తోంది. దీంతో అసోసియేషన్ ఖాతాల వ్యవహారం కాళేశ్వరం కేసులో మరో కీలక లింక్‌గా మారింది.