తెలంగాణ
రేవంత్ సర్కార్ కు కొత్త సవాలు.. హాట్‌టాపిక్‌గా మారుతున్న కాంగ్రెస్ రాజకీయాలు!..
అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై జరుగుతున్న వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, పార్టీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసినట్లు సమాచారం.
