తెలంగాణ
Telangana: కాంగ్రెస్ సర్కార్‌కు కరువు గండం.. పతనం ఖాయమా?..
తెలంగాణలో సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్‌గా మారాయి. పలు జిల్లాల్లో పంట పొలాలు ఎండిపోతుండటంతో రైతాంగంలో అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజల నుంచి నేరుగా ప్రశ్నలు ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
