TG: మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. 41 కొత్త 2బీ బార్లకు గ్రీన్ సిగ్నల్, 28 నుంచే దరఖాస్తులు!
TG: తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 41 మద్యం బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. పెరిగిన జనాభా, కొత్త పురపాలక సంఘాల ఆవిర్భావం, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం నేపథ్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వ్యాపారుల నుంచి 2బీ బార్ల లైసెన్సుల నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తూ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఒక్కో అప్లికేషన్‌కు నాన్-రీఫండబుల్ ఫీజుగా ఏకంగా రూ.1 లక్ష నిర్ణయించడం ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ నెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ గడువు అందుబాటులో ఉంటుంది. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ఏరియాల్లో ఏర్పాటయ్యే 14 బార్లకు సంబంధించి హైదరాబాద్‌లోని అబ్కారీ భవన్ కమిషనర్ కార్యాలయంతో పాటు స్థానిక డీసీ ఆఫీసుల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
