తెలంగాణ

Telangana: సీఎం రేవంత్‌ రెడ్డికి బెస్ట్ పబ్లిక్ సర్వెంట్–2026 అవార్డు!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మకమైన అరుదైన గౌరవం దక్కింది. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్‌ నేత, దివంగత ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకార్థం అందించే "బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌–2026" అవార్డుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆర్యదాన్‌ ముహమ్మద్‌ ఫౌండేషన్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. రాష్ట్రంలోని రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, రేవంత్‌రెడ్డి దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్‌ వర్కింగ్‌ ఛైర్మన్‌, నిలంబూర్‌ ఎమ్మెల్యే ఆర్యదాన్‌ షౌకత్‌ తెలిపారు. ప్రజాస్వామిక విలువల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న నిబద్ధతను జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది.