టాప్ న్యూస్

తీన్మార్ మల్లన్న@ కారు కూతలు, రోత మాటలు..!

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. ఈ పేరు వింటే చాలు జర్నలిజం మాటున అధికార పార్టీ నేతలను ఇష్టానుసారంగా బూతులు తిట్టడం, కారుకూతలు కూయడం కనిపిస్తుంటుంది. జర్నలిజం అనే ముసుగు కప్పుకుని తన పొలిటికల్ కెరీర్‌కు బాట వేసుకున్నాడని విమర్శలున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావును ఎక్కువగా టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కేసులు ఎదుర్కొవడం,పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాడు. చింతపండు నవీన్ అనే పేరు కంటే తీన్మార్ మల్లన్నగా ఫేమస్ అయ్యాడు. నాడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాయింట్ ఔట్ చేసి ప్రజల గొంతుకగా నిలిచాడు. అయితే, కాలక్రమేణా ఆయన వాయిస్ మారుతూ వచ్చింది. జర్నలిజం నుంచి పొలిటికల్ ఎజెండాతో ముందుకు నడిచాడు. పార్టీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు.