వైరల్ న్యూస్
Technology: మరో పదేళ్లలో AI మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ. మనం ఆలోచించే విధానం నుంచి ఉద్యోగాలు, వైద్యం, విద్య, రక్షణ, సైబర్ సెక్యూరిటీ వరకు దాదాపు ప్రతి రంగంలోనూ AI ప్రభావం వేగంగా పెరుగుతోంది. అయితే ఇదే టెక్నాలజీ భవిష్యత్తులో మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నపై పెద్ద చర్చే జరుగుతోంది.. ఇలాంటి సమయంలో AI రంగంలో పనిచేసిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మూడేళ్లపాటు AI పరిశోధనలో పనిచేసిన ఆయన.. ప్రస్తుత అభివృద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన హెచ్చరిక చేశారు. ఈ దశాబ్దం చివరి నాటికి అత్యంత శక్తివంతమైన AI వ్యవస్థలు మనుషుల నియంత్రణకు అందకుండా వెళ్లే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
