వైరల్ న్యూస్
Techie : నెలకు రూ.2 లక్షల జీతం..నేనూ పేదవాడినే అంటున్న టెకీ
డబ్బు ఎంత ఉన్నా ఓ సామాన్యుడికి ఆనందాన్ని మాత్రం పంచలేకపోతున్నది. కారణం ద్రవ్యోల్బణం, లివింగ్ కాస్ట్..పల్లెల్లో పనులు లేక చాలా మంది పట్టణాల బాట పడుతున్నారు.ఊర్లలో సొంత ఇండ్లు ఉంటాయి. అక్కడ రూ.10వేలు వచ్చినా హ్యాపీగా బతికేయొచ్చు. కానీ, నెలకు దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ, ఎలాంటి అప్పులు (ఈఎంఐలు) లేకపోయినప్పటికీ తాను ఒక పేదవాడిలాగే ఫీల్ అవుతున్నానని ఓ టెకీ వాపోయాడు. బెంగళూరుకు చెందిన సదరు సాఫ్ట్వేర్ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
