ఫ్లెక్సీల చించివేత.. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఫీవర్!
నగరంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు, జీహెచ్ఎంసీ తొలగించడంపైనా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ అంటే ఎందుకంత భయం రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఖైరతాబాద్‌లో గులాబీ జెండా రెపరెపలు చూసి కాంగ్రెస్ సర్కార్‌కు వణుకు పుడుతోందని, ఖైరతాబాద్ సీనియర్ నేత జిబ్రాన్ బీఆర్‌ఎస్‌లో చేరికను చూసి అధికార పార్టీ ఓర్వడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్, విరించి హాస్పిటల్, పంజాగుట్ట, సోమాజిగూడ పరిసరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ జీహెచ్‌ఎంసీ అధికారులను అడ్డం పెట్టుకుని ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫ్లెక్సీలు తొలగింపుపై ప్రశ్నిస్తే జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమాధానం దాటవేస్తున్నారని, పై అధికారుల ఆదేశాలంటూ చెబుతున్నారని వెల్లడించారు.
