తెలంగాణ

తాతా మధు కామెంట్స్.. స్పీకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ

రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్దం నడుస్తోంది. నల్లటి దుస్తులు వేసుకుని వస్తే అసెంబ్లీలోకి అనుమతించలేదని, పోలీసుల చేత దాడులు చేయించడంతో పాటు తిరిగి మాపైనే కేసులు పెట్టారని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. అయితే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని అసభ్యపదజాలంతో దూషిస్తారా? అంటూ మండపడుతోంది. ఈ క్రమంలోనే నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం స్పీకర్ చాంబర్‌లో గడ్డం ప్రసాద్ కుమార్‌‌ను సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాలు, ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం, ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ఓదార్చిన సీఎం.. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, బాధ్యులపై చట్టపరంగా తగిన తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం.