సినిమా

Tarun - Tollywood: ఒకప్పటి లవర్ బాయ్ ఇప్పుడు విలన్‌గా కూడా పనికిరాడా?

Tarun: ఫేడవుట్ అయిన చాలామంది సీనియర్ హీరోలు ఇప్పుడు విలన్ పాత్రలతో, క్యారెక్టర్స్‌తో మళ్ళీ బిజీ అయ్యారు. కానీ, ఒకప్పుడు లవర్ బాయ్‌గా స్టార్ ఇమేజ్ ఉన్న తరుణ్ కి మాత్రం కనీసం విలన్ పాత్రలైనా చేసే ఛాన్స్ రావడం లేదు. మరి, తరుణ్ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదా, నిజంగా అవకాశాలు రావడం లేదా, మేకర్స్ అందరూ పక్కన పెట్టారా అనేది మాత్రం తెలియదు. తరుణ్ గనక సినిమాలు ఒప్పుకుంటే ఖచ్చితంగా మంచి పాత్రలే వస్తాయి. పైగా ఈ యంగ్ హీరో చేసిన మేకర్స్ అంతా అత్యంత సన్నిహితులే. మరి, ఈ గ్యాప్ ఎక్కడొస్తుందో ఎందుకొస్తుందో తరుణ్‌కే తెలియాలి.