తెలంగాణ
టార్గెట్ తుమ్మిడిహెట్టి.. సీఎం రేవంత్ ముంబై పర్యటన ఫిక్స్
తెలంగాణలోని సాగు,తాగు నీటి రంగానికి ప్రాణం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఎప్పటినుంచే ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎలాంటి ఎత్తిపోతలు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపి అక్కడి నుంచి హైదరాబాద్కు నీటిని సరఫరా చేయాలని చూస్తోంది.ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని చూస్తోంది. అందుకు మహారాష్ట్ర సర్కార్ అభ్యంతరం చెబుతోంది. ముంపు ప్రభావం తమకు ఎక్కువగా ఉంటుందని,అందుకు సమ్మతించబోమని గతంలో పేర్కొంది.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం వచ్చే సోమవారం ముంబైలో పర్యటించనుంది.
