National

ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. రిస్క్ లో బాలిక జీవితం!..

కోయంబత్తూర్‌లో ఓ తండ్రి చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రక్తహీనతతో ఆస్పత్రిలో చేరిన తన కుమార్తెకు రక్తం ఎక్కించారని.. కొన్ని నెలల తర్వాత ఆమెకు హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులందరికీ హెచ్‌ఐవీ లేదని పరీక్షల్లో తేలినట్టు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్ల తన బిడ్డ జీవితం ప్రమాదంలో పడిందని మండిపడ్డారు. ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి పై విచారణ జరిపించాలని, కుమార్తెకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.