క్రైమ్
తమిళనాడు టు ఢిల్లీ.. రైలులో తల లేని మొండెం ట్రావెల్!(వైరల్)
ఓ నిందితుడు డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కించి ఢిల్లీకి పంపాడు. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఓ ట్రాలీ బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించింది. జనరల్ బోగీలో ఉన్న ఆ బ్యాగ్ నుంచి దుర్వాసన రావడం, రక్తపు మరకలు ఉండటంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆ బ్యాగ్‌ను పరిశీలించగా.. తల, కొన్ని శరీర భాగాలు లేని మృతదేహం లభ్యమైంది. బాడీ అవయవాలకు చుట్టిన పాలిథిన్ కవర్‌పై చెన్నైకు సంబంధించిన స్లిప్ ఉండటంతో.. ఆ బాడీ చెన్నైకి చెంది ఉండొచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు.
