National
హిందీపై తమిళనాడు ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!
తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల (JNV) ఏర్పాటు, హిందీ భాష బోధనపై కొనసాగుతున్న సుదీర్ఘ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు గడ్డపై హిందీని నేర్పించకూడదనే పట్టుదలను విడనాడాలని, రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకోవాలని ధర్మాసనం హితవు పలికింది. ప్రతీ జిల్లాలో నవోదయ పాఠశాలల స్థాపనకు భూమిని గురించాలంటూ 2025 డిసెంబర్లో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్ను రద్దు చేయడానికి కోర్టు నిరాకరించింది.
