తెలంగాణ

Talasani Srinivas Yadav: ఖైరతాబాద్ ఉపఎన్నికను తలసాని పర్సనల్ ప్రెస్టేజ్‌గా తీసుకుంటున్నారా !

Talasani Srinivas Yadav: రాష్ట్ర రాజకీయాల్లో ఉప ఎన్నిక నగారా మోగకముందే ఖైరతాబాద్ నియోజకవర్గం కేంద్రంగా పొలిటికల్ హీట్ పీక్స్‌కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజా అడుగులు చూస్తుంటే.. ఈ ఉపఎన్నికను ఆయన అత్యంత వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం పార్టీ గెలుపు మాత్రమే కాకుండా, తన రాజకీయ వారసుడైన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు ఈ ఎన్నికను ఒక 'లిట్మస్ టెస్ట్'గా భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.