International
SwissGlaciersMelting: వేగంగా కరిగిపోతున్న మంచు పర్వతాలు.. 2,100లో జరిగేది ఇదేనా?
ప్రపంచంలోనే అత్యంత రమణీయమైన పర్యాటక ప్రాంతమైన స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వత శ్రేణులు పర్యావరణ మార్పుల కారణంగా తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. శీతాకాలంలో తెల్లటి మంచు దుప్పటి కప్పుకుని పర్యాటకులను పరవశింపజేసే స్విస్ గ్లేసియర్లు చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా కరిగిపోతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 'స్విస్ గ్లేసియర్ మానిటరింగ్ నెట్వర్క్ (గ్లామోస్)', 'స్విస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' ప్రచురించిన తాజా పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గడిచిన ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే స్విట్జర్లాండ్ తన పర్వతాలపై ఉన్న మంచులో ఏకంగా 20శాతాన్ని శాశ్వతంగా కోల్పోయింది.
