స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

SWECHAA Exclusive: ఫార్ములా-ఈ రేసుల కుంభకోణం.. ఏసీబీ ఛార్జ్‌షీట్‌లో కేటీఆర్‌పై సంచలన అభియోగాలు!

తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా-ఈ రేసుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా-ఈ రేసుల నిర్వహణ, నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపిన దర్యాప్తు సంస్థ (ఏసీబీ), మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై సంచలన అభియోగాలతో ముగింపు నివేదికను సేకరించింది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (A1), ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (A2), బీఎల్‌ఎన్ రెడ్డి (A3), గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు (A4), ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్-FEO (A5)లను నిందితులుగా పేర్కొంటూ క్రిమినల్ కుట్ర, నమ్మకద్రోహం, ప్రభుత్వ ధనం దుర్వినియోగం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.