స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Swechaa Effect: 22-A భూతంగా చూపిస్తే సహించేది లేదు: మంత్రి పొంగులేటి
నిషేధిత భూముల (Section 22-A) పేరిట సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై ‘స్వేచ్ఛ’ దినపత్రిక ప్రచురించిన వరుస కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రచురించిన కథనాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే సమీక్షకు ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
