తెలంగాణ
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికుల అరెస్ట్!
రాజధాని హైదరాబాద్లో స్వచ్ఛ ఆటో కార్మికులు తమ ఉపాధిని కాపాడుకోవాలని కోరుతూ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్మికులు శాసనసభ ముట్టడికి యత్నించారు. అయితే, బషీర్ బాగ్ సమీపంలోని ఎల్బీ స్టేడియం వద్ద అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, ముందస్తుగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
