క్రైమ్

ఫామ్‌హౌస్‌లో అసలేం జరిగింది? రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద మృతి

Farmhouse: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. బీటెక్ చదువుతున్న కృష్ణ కౌండిన్య (21) స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి విగతజీవిగా మారాడు. ఉప్పల్ బగాయత్ కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కుమారుడు కౌండిన్య తన ఫ్రెండ్ రిషబ్ తో కలిసి పుట్టిన రోజు వేడుకల కోసం ఏదులాబాద్ లోని ఒక ఫామ్‌హౌస్‌కి వెళ్లాడు. కాగా, అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయాడు అంటూ అతడి తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. కౌండిన్యను స్నేహితులు ఘట్ కేసర్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.