క్రైమ్

ఓయోలో యువతి అనుమానాస్పద మృతి..వెలుగులోకి షాకింగ్ నిజాలు

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద మృతి కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి వైజాగ్‌కు చెందిన యువతి షారన్ నిఖిత టోప్నో (23) నగరానికి వచ్చింది. వీరిద్దరూ మాదాపూర్ సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్-5లోని ఓయో హోటల్ రూమ్ నం.303లో దిగారు.అయితే, అర్ధరాత్రి తన ప్రియురాలు అస్వస్థతకు గురైందని హోటల్ మేనేజర్‌కు ప్రియుడు సమాచారం ఇచ్చాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు యువతి మృతిపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.మాదాపూర్ ఓయో రూమ్‌లో బీర్, విస్కీ బాటిల్స్‌ పగిలినట్లు పోలీసులు గుర్తించారు. బెడ్‌తో పాటు రూమ్ గోడలపై రక్తపు మరకలు సైతం ఉన్నట్టు తేల్చారు. మృతురాలు షారన్ నిఖిత ముఖం, శరీరంపైనే కాకుండా, తల వెనుక కూడా తీవ్ర గాయాలు ఉన్నట్టు నిర్దారించారు.