క్రైమ్
ఓయోలో యువతి అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?
ఓయో హోటల్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. నగరంలోని ఎస్ఆర్ నగర్లో గల గోకుల్ ప్రైడ్ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. అంతకుముందు సీ గణేశ్ పేరుతో గోకుల్ ప్రైడ్‌లో యువతి, యువకుడు రూమ్ నం.103 తీసుకున్నట్టు హోటల్ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, తెల్లారేసరికి యువతి అనుమానాస్పద మృతి చెందగా.. యువకుడు కనిపించలేదు. అయితే, ఆ రాత్రి ఏం జరిగింది? ఆ యువకుడే యువతిని హత్యచేశాడా? అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడా? అనేది తెలియాల్సి ఉంది.ఉదయం హోటల్ సిబ్బంది వెళ్లే సరికి గది తలుపులు తెరిచి ఉండటం, అందులో యువతి విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఆధార్ కార్డులో యువతి పేరు ‘దుర్గ’అని ఉందని గుర్తించారు.
