తెలంగాణ
TG: కాలువ జాగాలకే ఎసరు.. తహసీల్దార్ సహా ముగ్గురు అధికారులు సస్పెండ్!
TG: సర్కారు జాగాలను కాపాడాల్సినోళ్లే కబ్జాదారులతో చేతులు కలిపితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చేశారు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్. సాక్షాత్తూ నాగార్జునసాగర్ కాలువ భూములు, సీలింగ్ భూములను కాజేసేందుకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై వేటు వేశారు. హుజూర్నగర్ తహసీల్దార్ కవితతో పాటు ఆర్ఐ కాశీం షరీఫ్, జీపీవో జానీ పాషాలను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.హుజూర్‌నగర్‌లోని 458, 281 సర్వే నంబర్ల పరిధిలో పెద్ద ఎత్తున భూ దందా జరిగినట్లు ఆర్డీవో విచారణలో తేలింది. సాగునీటి కాలువలకు చెందిన భూములను అసలు రికార్డులు చూడకుండా, కోర్టు ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా తప్పుడు రిపోర్టులు ఇచ్చి మరీ రిజిస్ట్రేషన్లకు వీళ్లు సహకరించారని బయటపడింది.
