తెలంగాణ
Surekha: గులాబీ, కమలం పార్టీల గేట్లు మూసివేత.. సురేఖ దారెటు..?
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అయిన ప్రస్తుతం ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఆమె దీర్ఘకాలంలో హస్తం గూటిన ఉండే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినప్పటికీ.. సురేఖ ఏ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడితే బీఆర్ఎస్, బీజేపీ ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం సురేఖ విషయంలో ముందుగానే స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు తెలుస్తోంది.
