తెలంగాణ

‘దానం’కు సుప్రీం షాక్.. రేవంత్ ఇకనైనా బుద్ది తెచ్చుకో : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం సైతం రాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్థించింది. స్టే ఇవ్వలేమని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.అయితే, దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు కావడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించడం రాజ్యాంగ విజయమని పేర్కొన్నారు. బీజేఎల్పీ చేసిన న్యాయపోరాటం వల్లే ఈ విజయం దక్కిందని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై కోర్టుల్లో న్యాయపోరాటం క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని వెల్లడించారు.