ఏపీ సర్కారుకు ‘సుప్రీం’ షాక్.. నామినేషన్ల గడువు పెంపు!
ఏపీ లోకల్ బాడీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. నామినేషన్ ప్రక్రియ సమయంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య వివాదం రాజుకుంది.ఈ క్రమంలోనే పలు మున్సిపాలిటీల పరిధిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మున్సిపాలిటీలకు నామినేషన్ల గడువు ఇప్పటికే ముగియగా.. తాజాగా సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న మొత్తం 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని ఆదేశించింది. దీనికి తోడు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల గడువుపై ఇవాళే నిర్ణయం తీసుకోవాలన్న న్యాయస్థానం.. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది.
