రాహుల్ గాంధీ సహా ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయడంతో పాటు అర్హుల ఓట్లు తొలగించిన సీఈసీ పదవి నుంచి తప్పుకోవాలని ఈ సందర్భంగా ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే,సుప్రీంకోర్టు ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించిన వ్యవహారంపై దేశ సర్వోన్నత నాయకత్వంపై తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 'ఇండియా' కూటమికి చెందిన పలువురు ప్రముఖ నేతలకు సుప్రీం కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సుప్రీంకోర్టును ఎవరూ భయపెట్టలేరు. కోర్టు బయట ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో మాకు స్పష్టంగా తెలుసు’ అని సీజేఐ సీరియస్ అయినట్టు తెలిసింది.
