తెలంగాణ
ఓటుకు నోటు కేసుపై సుప్రీంలో విచారణ.. న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును ప్రభావితం చేసేంందుకు ఓ ప్రజాప్రతినిధికి లంచం ఆఫర్ చేసిన కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఆ కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.అయితే, తన మీద నమోదైన కేసు కొట్టివేయాలని సుప్రీంకోర్టును రేవంత్ రెడ్డి కోరినట్టు తెలిసింది.కేసు విచారణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 2015లో జరిగిన ఘటనకు 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టం వర్తించదని సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వివరించారు. అయితే, ఓటు అనేది చట్టబద్ధమైన హక్కు అని, దానిని ప్రభావితం చేసినప్పుడు అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.
