National

Supreme Court: సీజేపీ ధర్నా కోసం మెట్రోలను ఆపొద్దు.. కేంద్రానికి ‘సుప్రీం’ ఆదేశం!

Supreme Court: ఢిల్లీలో ఎవరైనా ధర్నాకు పిలుపునిస్తే చాలు.. రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తూ సామాన్య ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టే పద్ధతిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనల సాకుతో ఏకంగా 57 మెట్రో స్టేషన్లు, రైలు సర్వీసులను క్లోజ్ చేయాలన్న కేంద్రం నిర్ణయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వెంటనే ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని మోడీ సర్కార్‌ను ఆదేశించింది.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న నిరసన కార్యక్రమం జరగనుంది. దీనిని అడ్డుకునేందుకు, ముందుజాగ్రత్త చర్యల పేరుతో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచే ఏకంగా 57 మెట్రో స్టేషన్లను, పరిసర ప్రాంతాల్లోని రైల్వే సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆంక్షలు శనివారం రోజంతా అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది.