National

రాహుల్, ఖర్గేకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్

ఎస్ఐఆర్, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించేందుకు లోక్‌సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను అపాయింట్‌మెంట్ కోరగా ఆయన నిరాకరించారు.అందుకు గల కారణాలను చీఫ్ జస్టిస్ సోమవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. అయితే, రాహుల్ గాంధీ, తనకు మధ్య నడిచిన లేఖల రాయభారంపై వివరాలు వెల్లడించేందుకు జస్టిస్ సూర్యకాంత్ ఇష్టపడలేదు.కేంద్రప్రభుత్వం ‘ఓటు చోరీ’కి స్వస్తి పలకాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) నిలిపివేత, ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించేందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గేలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు ఆదివారం రాహుల్ గాంధీ సీజేఐకి లేఖ రాయగా.. కలువడం వీలు కాదని సీజేఐ తిరిగి లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు.