National

Supremcourt : బెంగాల్లో భారీగా ఓట్లు డిలీట్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

పశ్చిమ బెంగాల్లో ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)పై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్ల పరిష్కారంపై స్పందించిన సుప్రీంకోర్టు.. విచారణ సందర్భంగా ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వారి వివరాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI)ను న్యాయస్థానం కోరింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఓటర్ల తొలగింపుపై వచ్చిన ఫిర్యాదులు, అప్పీళ్లను ఎంతమేర పరిష్కరించారో స్పష్టమైన సమాచారాన్ని నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.