తెలంగాణ
Sunil Bansal : తెలంగాణ బీజేపీని ‘ఇజ్జత్ కా సవాల్’గా తీసుకున్న సునీల్ బన్సల్!
తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్ఠానం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ‘ఎలక్షన్ మాస్టర్ మైండ్’ సునీల్ బన్సల్.. తెలంగాణపై కన్నేశారు. బెంగాల్, ఒడిశా వంటి గడ్డు కోటలను సైతం బీజేపీ ఖాతాలో వేయడంలో కీలక పాత్ర పోషించిన బన్సల్, ఇప్పుడు తెలంగాణను తన వ్యక్తిగత ‘ఇజ్జత్ కా సవాల్’గా మార్చుకున్నారు. అక్కడ సక్సెస్ కొట్టి ఇక్కడ విఫలమైతే తన ట్రాక్ రికార్డుకు మచ్చ పడుతుందన్న భావనతో, తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాల్సిందేనని అత్యంత పట్టుదలతో పావులు కదుపుతున్నారు.
