National

Sukhbir Singh Badal: మాజీ డిప్యూటీ సీఎంపై పదునైన ఆయుధంతో దాడి.. ఆసుపత్రికి తరలింపు

Sukhbir Singh Badal: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై దాడి జరిగింది. దుండగుడు పదునైన ఆయుధంతో బాదల్ పై దాడికి తెగబడ్డాడు. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఈ ఘటన జరిగింది. సుఖ్ బీర్ సింగ్ బాదల్ మాతా సాహిబ్ గురుద్వార దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాదల్ పై అటాక్ చేశాడు. ఈ దాడిలో బాదల్ చేతికి గాయాలయ్యాయి. దుండగుడిని అడ్డుకునే ప్రయత్నంలో భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.