క్రైమ్
Suicide: విశాఖలో కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!..
విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ కొంతకాలంగా జీవనోపాధి కోసం పెందుర్తిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా నిన్న కుటుంబ సభ్యులతో రాఖీలు కట్టించుకున్న ప్రవీణ్ కుమార్.. రాత్రి సమయంలో ఉరివేసుకుని మరణించగా.. అతని భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు విషపదార్థం తిని ఆత్మహత్య చేసుకున్నారు.
