సినిమా

Suhas Controversy: రంగుతో పనేంటి భయ్యా? డైరెక్టర్ మతిమారన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు!

Suhas Controversy: క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉంటూ పబ్లిక్ స్టేజ్‌లపై కల్లర్ ప్రస్తావన తీసుకురావడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. ‘మండాడి’ సక్సెస్ మీట్ వేదికగా టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ స్కిన్ టోన్, ఆయన ఎదుర్కొన్న కామెంట్స్ గురించి దర్శకుడు మతిమారన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు, ఆగ్రహానికి కారణమయ్యాయి.సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ మతిమారన్ మాట్లాడుతూ.. సుహాస్ ఎంతో టాలెంటెడ్ యాక్టర్ అయినప్పటికీ, గతంలో వర్ణ వివక్షతో కూడిన కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందనే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఈ క్రమంలో ఆయన మాట్లాడిన తీరు తెలుగు ప్రేక్షకులను, పరిశ్రమను కించపరిచేలా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "కలర్ ఫోటో", "రైటర్ పద్మభూషణ్" వంటి సినిమాలతో తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సుహాస్ టాలెంట్‌ను చూడకుండా.. బహిరంగ వేదికపై రంగును తెరపైకి తేవడంపై టాలీవుడ్ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.