తెలంగాణ

పనిమనుషులుగా విద్యార్థులు.. తినాలంటే చేసుకోవాల్సిందేనా?

రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్థిక స్థోమత లేక చదువు బాగా చెబుతారని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు బాధపడేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి వడ్డించే భోజనం, ఇచ్చే దుస్తులు సరిగా ఉండటం లేదని,టీచర్లు పాఠాలు సరిగా చెప్పడం లేదని, పిల్లలతోనే అన్ని పనులు చేయించుకుంటున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా దామరచర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థుల చేత ప్రిన్సిపాల్ చపాతీలు చేయించినట్టు తెలిసింది. వారిని ప్రిన్సిపాల్, వార్డెన్లు పనిమనుషులుగా మార్చినట్టు సమాచారం. ప్రభుత్వం వంట మనుషులకు జీతం ఇస్తున్నా వారితో పనిచేయించకుండా విద్యార్థుల చేతే వంట పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు.