National
student : పుస్తకం తీసుకురాలేదని.. విద్యార్థిని మృతి
బుక్ తీసుకుని రాలేదన్న కోపంతో పదేళ్ల విద్యార్థినిని క్లాస్ టీచర్ ఎండలో నిలబెట్టింది.అయితే, కాసేపటికే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. అనంతరం స్కూల్ యాజమాన్యం పేరెంట్స్కు సమాచారం అందించారు. దాంతో విద్యార్థిని తల్లి అంజలి వెంటనే హుటాహుటిన స్కూల్కు వెళ్లింది. వెళ్లేసరికి అక్కడ కూతురు ఎండలో నిలబడి ఉండటాన్ని గమనించింది.అప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు చికిత్స అందించగా.. ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. ఢిల్లీలోని వినోద్ నగర్లో గల సర్వోదయ కన్యా విద్యాలయంలో ఈ ఘటన గత నెల 27న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పుస్తకం తీసుకెళ్లలేదని టీచర్ ఎండలో నిలబెట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని బాధిత పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
