తెలంగాణ
వర్షాలు పడట్లేదని ఆ గ్రామంలో వింత చర్య
వర్షాలు కురవడం లేదని తెలంగాణలోని ఓ గ్రామంలోని ప్రజలు వింత చర్యకు పూనుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా వారు చేసిన పని ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.ఇలా కూడా ఉన్నారా? జనాలు అని చర్చ జరుగుతోంది.వర్షాలు రాకపోతే పూజలు చేయడం చూసి ఉంటారు. కప్పు తల్లి ఆటలు,గాడిదలకు పెళ్లి చేయడం వంటివి నేటికీ కొన్ని గ్రామాల్లో ప్రజలు పాటిస్తుంటారు. కానీ, పై వాటికి భిన్నంగా ఈ ఘటన ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వివరాల్లోకివెళితే.. వర్షాలు పడడం లేదని పూడ్చిన శవాన్ని బయటకు తీసి తిరిగి దహనం చేశారు గ్రామపెద్దలు.ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామంలో చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది.
