రాజకీయాలు

సీతమ్మ సాగర్ ముంపులో ఇసుక తవ్వకాలు ఆపండి : ఎన్‌జీటీ

రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది.రాష్ట్రంలోని ములుగు జిల్లాలో గల సీతమ్మ సాగర్ ముంపు ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ స్టే ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తవ్వకాల కోసం మూడు ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను తప్పుబట్టింది.కాగా, సీతమ్మసాగర్‌ ముంపు ప్రాంతంలో 48 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.దీంతో గోదావరి నది మధ్యలో కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేపడుతుండగా.. వారికి ప్రభుత్వ పెద్దల మద్దతు ఉన్నట్టు సమాచారం.అయితే, పూడికతీత పేరుతో రూ.కోట్లల్లో స్థానిక అధికార పార్టీ నేతలు అక్రమంగా సంపాదించుకుంటున్నారని సమాచారం.