National

Starlink: స్టార్‌లింక్ వెనుక అసలు గేమ్ ఇదేనా? భారత్ ఎందుకు నో చెబుతోందంటే!

Starlink: భారతదేశ టెలికాం రంగంలోకి తన ‘స్టార్‌లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్‌కు పర్మిషన్స్ ఇవ్వకపోవటంపై ఎలాన్ మస్క్ ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక వ్యాపారవేత్తల గుత్తాధిపత్యం, మార్కెట్ లాబీయింగ్ వల్లే తనకు లైసెన్స్ రావడం లేదని మస్క్ ఆరోపించగా, కేంద్ర ప్రభుత్వం ఆ వాదనలను సూటిగానే తిప్పికొట్టింది. అయితే బయటకు వినిపిస్తున్న ఈ వ్యాపార వివాదం అసలు కథలో ఒక చిన్న భాగం మాత్రమే. తెరవెనుక అసలు కారణం కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ ఫీజులు కాదు.. దేశ సార్వభౌమాధికారం, అత్యంత సున్నితమైన జాతీయ భద్రత అని అంటున్నారు.మనం రోజూ వాడే మొబైల్ నెట్‌వర్క్‌ల మాదిరిగా స్టార్‌లింక్ కేవలం భూమిపై ఉండే టవర్లపై ఆధారపడదు. భూకక్ష్యలో తిరిగే వేలాది ఉపగ్రహాల ద్వారా నేరుగా యూజర్ డిష్‌కు ఇది కనెక్ట్ అవుతుంది. వినడానికి ఇది అధునాతన విప్లవంలా అనిపించినా, దీని వెనుక దాగున్న వాస్తవం ఏమిటంటే ఈ నెట్‌వర్క్ కంట్రోల్ మొత్తం స్పేస్‌ఎక్స్ అనే ఒకే ఒక్క విదేశీ ప్రైవేట్ సంస్థ గుప్పిట్లో ఉంటుంది.