చిత్రం లేదు
తెలంగాణ

StarlinkIndia: ‘వారెవరో పేర్లు బయటపెట్టండి..’ మస్క్ పోస్ట్‌పై కేటీఆర్ స్పందన!

 భారతీయ ఉపగ్రహ ఇంటర్నెట్ (సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్) మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలందించకుండా, తమ ఏకస్వామ్యాన్ని(Monopoly) కాపాడుకోవడానికి కొందరు వ్యాపార దిగ్గజాలు (ఒలిగార్క్స్) స్టార్‌లింక్ సేవలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఎక్స్ (X) వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  ఇది భారత ప్రజల హక్కులపై జరుగుతున్న నేరమంటూ మస్క్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అయితే, మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెంటనే స్పందించారు.