తెలంగాణ

Starlink: ఎలాన్ మస్క్ ‘స్టార్‌లింక్’ వెనుక భారత్‌ను కలవరపెడుతున్న బిగ్ థ్రెట్ ఇదేనా!

టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసించవచ్చని నిరూపించిన ఎలాన్ మస్క్.. ఇప్పుడు భారతదేశంలో తన శాటిలైట్ ఇంటర్నెట్ ‘స్టార్‌లింక్’ పాగా వేసేందుకు తీవ్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని టార్గెట్ చేస్తూ, ఆయన దేశానికి ప్రధానిలా వ్యవహరిస్తూ తనను అడ్డుకుంటున్నారంటూ మస్క్ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అయితే, పైకి ఇది ఇద్దరు బిలియనీర్ల మధ్య వ్యాపార పోరులా కనిపిస్తున్నప్పటికీ.. తెరవెనుక దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చే పరిణామాలు దాగి ఉన్నాయన్నది నిఘా వర్గాల విశ్లేషణ. అంతరిక్షంలో ఇప్పటికే 10 వేలకు పైగా ఉపగ్రహాలతో మూడింట రెండు వంతుల కక్ష్యను గుప్పిట్లో పెట్టుకున్న ఒక ప్రైవేట్ వ్యక్తి చేతికి భారత సమాచార వ్యవస్థను అప్పగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.