ఏపీ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుండగా, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా టీటీడీ రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది.
