క్రీడలు
Srinath: మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా టీమిండియా దిగ్గజం.. సోషల్ మీడియాలో వైరల్!
ఒకప్పుడు తన పదునైన వేగంతో ప్రపంచంలోని దిగ్గజ బ్యాటర్లను భయపెట్టిన భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్, బెంగళూరు ‘నమ్మ మెట్రో’లో సాధారణ ప్రయాణికుడిలా దర్శనమిచ్చారు. చేతిలో ట్రాలీ బ్యాగ్ పట్టుకుని, చెవులకు ఇయర్ బడ్స్ పెట్టుకుని నిలబడి ఉన్న ఆయన ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్న ఆయనను చూసి అభిమానులు 'శ్రీనాథ్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్' అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
