ఏపీ
పాకిస్తాన్కు దేశ రక్షణ సంస్థల రహస్యాలు.. భారీ కుట్రను బయటపెట్టిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్
Spy Network: భారత నేవీలో గూఢచర్యం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దేశ నేవీ, రక్షణ సంస్థల రహస్యాలను శత్రువుకి చేరవేసిన వైనం అలజడి సృష్టిస్తోంది. విశాఖ కేంద్రంగా జరిగిన ఈ భారీ గూఢచర్యం కుట్రను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో పాకిస్తాన్ స్పై నెట్ వర్క్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆపరేషన్ ఫైర్ వాల్ 2026 పేరుతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా భారీ కుట్రను బహిర్గతం చేసింది. శత్రువు చేతికి దేశ నేవీ, రక్షణ రహస్యాలను చేరవేస్తున్న ముఠాను వెలుగులోకి తెచ్చింది.
