Spirituality

ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? శాస్త్రం చెప్పేది ఇదే!..

మనిషికి లభించిన ఈ మానవ జన్మ కేవలం జీవించడానికి మాత్రమే కాదు.. తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి లభించిన ఒక అరుదైన అవకాశం. అందుకే భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో శరీరాన్ని మన స్వంత ఆస్తిగా కాకుండా.. దైవం ప్రసాదించిన సాధనంగా భావిస్తారు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, పరిస్థితులు భరించలేనివిగా అనిపించినప్పుడు.. జీవితం నుంచి తప్పించుకోవడమే పరిష్కారంగా భావించడం ఆధ్యాత్మిక దృష్టిలో సరైన మార్గం కాదు. ఎందుకంటే మనిషి ఎదుర్కొనే సుఖదుఃఖాలు కేవలం యాదృచ్ఛిక సంఘటనలు కావని.. వాటి వెనుక కర్మ సిద్ధాంతం పనిచేస్తుందని శాస్త్రాలు వివరిస్తాయి.