Spirituality
Spirituality: నూతన గృహాప్రవేశం బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు నిర్ణయిస్తారు?..
సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఇల్లు లేని వారికి ఉండే కల.. ఇందుకోసం ఎన్నో తిప్పలుపడి చివరికి నూతన గృహాన్ని నిర్మించుకుంటారు. అలా ఆ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే రోజు ప్రతి కుటుంబానికీ ఎంతో ప్రత్యేకమైనది. అందుకే మన సంప్రదాయంలో గృహప్రవేశానికి ఒక మంచి రోజు, మంచి సమయం చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో గృహప్రవేశం చేయాలని కొందరు పండితులు సూచిస్తుంటారు. ఇక బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు ఉండే పవిత్రమైన సమయం. సాధారణంగా సూర్యోదయానికి దాదాపు గంటన్నర ముందు ప్రారంభమయ్యే ఈ కాలాన్ని మన ధర్మశాస్త్ర సంప్రదాయంలో ప్రశాంతమైన, సాత్త్వికమైన సమయంగా భావిస్తారు.
