Spirituality
శ్రీవారికి ఆదిశేషుడే ఎందుకు వాహనం..?
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆదిశేష వాహన సేవకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. సప్తగిరులపై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఆదిశేషుడిని వాహనంగా అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిస్తారు.. పురాణాల ప్రకారం ఆదిశేషుడు శ్రీమహావిష్ణువుకు నిత్యసేవకుడు. క్షీరసాగరంలో విష్ణుమూర్తి శేషతల్పంపై శయనిస్తే.. ఆ స్వామివారికి ఆధారంగా నిలిచేది ఆదిశేషుడే. భగవంతుడి సేవలో తనను తాను పూర్తిగా అర్పించుకున్న శేషుడు.. భక్తి, దాస్యభావానికి ప్రతీకగా భావించబడతాడు.
