Spirituality
Spirituality: మనిషి మరణించిన తర్వాత తల దగ్గర దీపం ఎందుకు పెడతారు?
మనిషి ప్రాణం విడిచిన తర్వాత ఇంట్లో ఒక దీపం వెలిగించడం... తరతరాలుగా వస్తున్న సనాతన సంప్రదాయం. చాలామందికి అది ఒక ఆచారంగా మాత్రమే తెలుసు. కానీ గరుడ పురాణంలో మరణానంతరం జీవుడి ప్రయాణాన్ని వర్ణించినప్పుడు... దీపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం కనిపిస్తుంది. మరణంతో స్థూల దేహం మాత్రమే విడిచిపోతుంది. జీవుడి తదుపరి గతి అతని కర్మలను అనుసరించి సాగుతుందని గరుడ పురాణం వివరిస్తుంది. ఈ ప్రయాణాన్ని ప్రేత ఖండంలో మహావిష్ణువు గరుత్మంతుడికి వివరించినట్లు పురాణ సంప్రదాయం చెబుతుంది. మరణించిన జీవుడు యమమార్గంలో ప్రయాణించాల్సి ఉంటుందని... ఆ మార్గం సులభమైనది కాదని గరుడ పురాణం వర్ణిస్తుంది.
